హైదరాబాద్‌లో బృహస్పతి టెక్నాలజీస్ ప్లాంట్
ABN , Publish Date - Jun 27 , 2025 | 05:18 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత నిఘా, సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ బృహస్పతి టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.70 కోట్ల పెట్టుబడితో...
రూ.70 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత నిఘా, సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ బృహస్పతి టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.70 కోట్ల పెట్టుబడితో సీసీటీవీ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం నాడిక్కడ కంపెనీ ఎండీ రాజశేఖర్ పాపోలు మాట్లాడుతూ.. హైదరాబాద్ సమీపంలోని తునికి బొల్లారంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు 2.5 లక్షల యూనిట్ల సామర్థ్యంతో నెలకొల్పుతున్న ఈ ప్లాంట్ వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి రానుందన్నారు. కంపెనీ ఇప్పటికే పటాన్‌చెరులో అసెంబ్లింగ్ యూనిట్‌ను నిర్వహిస్తోందని తెలిపారు.
కాగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) అయిన కింగ్స్‌మెన్ గ్లోబల్, సిట్రస్ గ్లోబల్ నుంచి రూ.85 కోట్ల నిధులను సమీకరించినట్లు రాజశేఖర్ వెల్లడించారు. అలాగే మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎ్‌సఆర్‌టీసీ) నుంచి రూ.102 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి రావాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరం కంపెనీ టర్నోవర్ రూ.250 కోట్లుగా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజశేఖర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే.. పూర్తి చేశారా లేదా..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..