Bondada Engineering: అదానీ గ్రూప్ నుంచి రూ 1050 కోట్ల ఆర్డర్
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:18 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కి అదానీ గ్రూప్ నుంచి రూ.1,050 కోట్ల విలువైన భారీ ఆర్డర్...
బొండాడ ఇంజనీరింగ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కి అదానీ గ్రూప్ నుంచి రూ.1,050 కోట్ల విలువైన భారీ ఆర్డర్ లభించింది. ఆర్డర్‌లో భాగంగా గుజరాత్‌లోని ఖావ్డా వద్ద అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ సిక్స్ కంపెనీలు ఏర్పాటు చేసే 650 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన యంత్ర పరికరాలను బొండాడ ఇంజనీరింగ్.. ఈపీసీ పద్ధతిలో సరఫరా చేస్తుంది. ఆర్డర్ అందుకున్న ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..
రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి