Blue Cloud Softtech: సెమీకండక్టర్ల రంగంలోకి బ్లూ క్లౌడ్
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:03 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీసీఎ్‌సఎ్‌సఎల్) సెమీకండక్టర్ల రంగంలోకి విస్తరిస్తోంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీసీఎ్‌సఎ్‌సఎల్) సెమీకండక్టర్ల రంగంలోకి విస్తరిస్తోంది. ఇందుకు అవసరమైన టెక్నాలజీ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ కోసం ఒక ఇజ్రాయెల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఇజ్రాయెల్ కంపెనీ ఎడ్జ్-ఏఐ చిప్ హార్డ్‌వేర్ డిజైన్, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన టెక్నాలజీని బీసీఎ్‌సఎ్‌సఎల్‌కు బదిలీ చేస్తుంది. ఇందుకోసం బీసీఎ్‌సఎ్‌సఎల్.. ఇజ్రాయెల్ కంపెనీకి 15 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,330 కోట్లు) చెల్లిస్తుంది. చిప్స్, సెమీకండక్టర్లకు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆఫ్ థింగ్స్ (ఏఐఓటీ), ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అప్లికేషన్స్‌లో విరివిగా ఉపయోగిస్తారు. భారత సెమీకండక్టర్ల రంగంలో ’ఆత్మనిర్భరత’ సాధనలో ఈ ఒప్పందం ఒక కీలక ముందడుగు’ అని బీసీఎ్‌సఎ్‌సఎల్ చైర్మన్ జానకి యార్లగడ్డ తెలిపారు.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి