Share News

గ్లాండ్‌ ఫార్మా కొనుగోలు రేసులో బ్లాక్‌స్టోన్‌, వార్‌బర్గ్‌ పింకస్‌!

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:38 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న గ్లాండ్‌ ఫార్మా లిమిటెడ్‌ (జీపీఎల్‌) యాజమాన్యం మరోసారి చేతులు మారే సూచనలు కనిపిస్తున్నా యి. ఈ కంపెనీ ఈక్విటీలో ప్రస్తుతం చైనా కేంద్రంగా...

గ్లాండ్‌ ఫార్మా కొనుగోలు రేసులో బ్లాక్‌స్టోన్‌, వార్‌బర్గ్‌ పింకస్‌!

51% వాటా కొనుగోలుకు పీఈ సంస్థల సన్నాహాలు

డీల్‌ విలువ రూ.26,000 కోట్లు?

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న గ్లాండ్‌ ఫార్మా లిమిటెడ్‌ (జీపీఎల్‌) యాజమాన్యం మరోసారి చేతులు మారే సూచనలు కనిపిస్తున్నా యి. ఈ కంపెనీ ఈక్విటీలో ప్రస్తుతం చైనా కేంద్రంగా పనిచేసే షాంఘై ఫోసన్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీకి 51 శాతం వాటా ఉంది. ఈ వాటాను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలు బ్లాక్‌స్టోన్‌, బ్రూక్‌ఫీల్డ్‌, వార్‌బర్గ్‌ పింకస్‌ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఈ డీల్‌ విలువ 300 కోట్ల డాలర్ల (సుమారు రూ.26,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.


8 ఏళ్ల క్రితం ఫోసన్‌ చేతికి: పీవీఎన్‌ రాజు 1978లో గ్లాండ్‌ ఫార్మాను ఏర్పాటు చేశారు. కంపెనీ తయారు చేసే జెనరిక్‌ ఇంజెక్లబుల్స్‌కు భారత్‌, అమెరికాతో పాటు దాదాపు 90 దేశాల్లో డిమాండ్‌ ఉంది. సుమారు ఎనిమిదేళ్ల క్రితం చైనా కంపెనీ షాంఘై ఫోసన్‌ ఫార్మా.. గ్లాండ్‌ ఫార్మా ఈక్విటీలో 74 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2020లో భారత్‌-చైనా దేశాల సరిహద్దు ఘర్షణ దగ్గరి నుంచి ఫోసన్‌.. గ్లాండ్‌ ఫార్మా నుంచి తప్పుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 23 శాతం వాటాను ఇతరులకు విక్రయించింది. తాజాగా మిగిలిన 51 శాతం వాటాను కూడా విక్రయించేందుకు పీఈ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్లు మోర్గాన్‌ స్టాన్లీ, యూబీఎస్‌ ఇందుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు ఫోసన్‌ ఫార్మా, జీపీఎల్‌ నిరాకరిస్తున్నాయి.


For Business News And Telugu News

Updated Date - Feb 14 , 2025 | 01:38 AM