Share News

ఫ్రెంచ్‌ కంపెనీతో భారత్‌ ఫోర్జ్‌ ఒప్పందం

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:01 AM

భారత రక్షణ దళాలకు ‘‘ఏరాక్‌’’ మానవ రహిత ఏరియెల్‌ వెహికల్‌ (యుఏవీ) సరఫరా కోసం ఫ్రెంచ్‌ కంపెనీ టర్గిస్‌ గైలార్డ్‌తో భారత్‌ ఫోర్జ్‌ ఒప్పందం...

ఫ్రెంచ్‌ కంపెనీతో భారత్‌ ఫోర్జ్‌ ఒప్పందం

భారత రక్షణ దళాలకు ‘‘ఏరాక్‌’’ మానవ రహిత ఏరియెల్‌ వెహికల్‌ (యుఏవీ) సరఫరా కోసం ఫ్రెంచ్‌ కంపెనీ టర్గిస్‌ గైలార్డ్‌తో భారత్‌ ఫోర్జ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అతి తక్కువ ధరలో అత్యుత్తమ టెక్నాలజీని అందుబాటులో ఉంచే లక్ష్యంతో తయారుచేసినదే ఏరాక్‌ యూఏవీ. ఇది అత్యధిక ఎత్తులో విహరిస్తూ సుదూర తీరాలపై నిఘా పెడుతుంది. అలాగే అందు లో అమర్చిన ఎలక్ర్టో మాగ్నెటిక్‌ సెన్సర్లు, రాడార్‌ శత్రు సేనల దాడులను తట్టుకుంటూనే శత్రువుల కదలికలపై దృష్టి పెడుతుంది. ఒకటిన్నర టన్నుల పేలోడ్‌ సామర్థ్యం గల ఏరాక్‌ 24 గంటల కన్నా అధిక సమయం ఎగిరే సామర్థ్యం కలిగి ఉంది. తమ ఫ్యాక్టరీలో ఏరాక్‌ ఉత్పత్తి లైన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని భారత్‌ ఫోర్జ్‌ ఈ సందర్భంగా తెలిపింది.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 05:01 AM