Equity Indices : రెండు రోజుల ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:28 AM
వారాంతం ట్రేడింగ్‌లో ఆద్యంతం లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. దాంతో మార్కెట్లో రెండు రోజుల ర్యాలీకి

ముంబై: వారాంతం ట్రేడింగ్‌లో ఆద్యంతం లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. దాంతో మార్కెట్లో రెండు రోజుల ర్యాలీకి తెరపడినట్లైంది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఈక్విటీ ట్రేడర్లు రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్ రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. శుక్రవారం మార్కెట్లో ట్రేడింగ్ ముగిసేసరికి, సెన్సెక్స్ 329.92 పాయింట్లు కోల్పో యి 76,190.46 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 113.15 పాయింట్ల నష్టంతో 23,092.20 వద్దకు జారుకుంది.