బిఎఎస్‌ఎఫ్ నుంచి రెండు కొత్త ఉత్పత్తులు
ABN , Publish Date - May 29 , 2025 | 02:13 AM
జర్మనీ కేంద్రంగా పనిచేసే బిఎఎస్‌ఎఫ్ అగ్రికల్చరల్ సొల్యూషన్స్ కంపెనీ భారత మార్కెట్‌లో వాలెక్సియో, మిబెల్యా పేరుతో రెండు సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జర్మనీ కేంద్రంగా పనిచేసే బిఎఎస్‌ఎఫ్ అగ్రికల్చరల్ సొల్యూషన్స్ కంపెనీ భారత మార్కెట్‌లో వాలెక్సియో, మిబెల్యా పేరుతో రెండు సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇందులో వాలెక్సియో క్రిమినాశిని వరి పంటను సుడి దోమ తెగులు నుంచి, మిబెల్యా శిలీంద్ర నాశిని పాము పొడ తెగులు నుంచి రక్షిస్తాయని బిఎఎస్‌ఎఫ్ ఇండియా కంపెనీ అగ్రికల్చరల్ సొల్యూషన్స్ విభాగం బిజినెస్ డైరెక్టర్ ఆర్ గిరిధర్ చెప్పారు. వరి దుబ్బు కట్టే దశలో, పొట్ట పోసుకునే దశలో వీటిని పిచికారీ చేయాల్సి ఉంటుంది. వీటి పిచికారీ ద్వారా దిగుబడులను బాగా దెబ్బతీసే సుడి దోమ తెగులు, పాము పొడ తెగుళ్ల నుంచి వరి పంటను పూర్తిగా కాపాడుకోవచ్చన్నారు. ఈ రెండు ఉత్పత్తుల అభివృద్ధిలో భారత్‌లోని బిఎఎస్‌ఎఫ్ ఇండియా పరిశోధనా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ రెండు మందులు వచ్చే నెల నుంచి అందుబాటులోకి వస్తాయని గిరిధర్ చెప్పారు. అగ్రికల్చరల్ సొల్యూషన్స్‌ను 2027 జనవరి నాటికి ప్రత్యేక కంపెనీగా విభజించి, ఐపీఓకు వెళ్లే యోచ న ఉందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ హీంజ్ తెలిపారు.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి