Share News

Canara Bank AI UPI App: కెనరా బ్యాంక్‌ కొత్త యాప్‌.. ఏఐ ఫీచర్లతో 'కెనరా ఏఐ1పే'..

ABN , Publish Date - Dec 24 , 2025 | 10:24 AM

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కెనరా బ్యాంక్ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇతర UPI యాప్‌ల్లో రిజిస్టర్ అయినవారు కూడా సులభంగా మైగ్రేట్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.

Canara Bank AI UPI App: కెనరా బ్యాంక్‌ కొత్త యాప్‌.. ఏఐ ఫీచర్లతో 'కెనరా ఏఐ1పే'..
Canara Bank AI UPI App

ఆంధ్రజ్యోతి, డిసెంబర్24: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కెనరా బ్యాంక్ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇతర UPI యాప్‌ల్లో రిజిస్టర్ అయినవారు కూడా సులభంగా మైగ్రేట్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ డిసెంబర్ 20, 2025న కొత్త యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్ ‘కెనరా ai1Pe’ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఏ బ్యాంక్ ఖాతాను అయినా లింక్ చేసుకొని వేగవంతంగా, సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. వ్యక్తిగత వినియోగదారులతో పాటు వ్యాపారులు, చిన్న దుకాణాలు, స్వయం ఉపాధి వ్యక్తులు కూడా సులభంగా చెల్లింపులు స్వీకరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.


ముఖ్య ఫీచర్లు:

స్పెండ్ అనలిటిక్స్: నెలవారీ ఖర్చుల విశ్లేషణ, కేటగిరీల వారీగా వివరాలు, ఆర్థిక ట్రెండ్స్ – మెరుగైన డబ్బు నిర్వహణకు సహాయపడుతుంది.

క్యూఆర్ స్కాన్ విడ్జెట్: హోమ్ స్క్రీన్‌లోనే QR కోడ్ స్కాన్ చేసి త్వరగా చెల్లింపు చేయొచ్చు.

UPI లైట్: చిన్న మొత్తాల చెల్లింపులకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా వేగవంతంగా ట్రాన్సాక్షన్.

UPI ఆటోపే: బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు, EMIలు, SIPలు ఆటోమేటిక్‌గా చెల్లింపు.

UPI డెలిగేట్ (UPI సర్కిల్): కుటుంబ సభ్యులకు లిమిట్‌తో చెల్లింపులు అనుమతి.

రివార్డ్స్ & క్యాష్‌బ్యాక్: ట్రాన్సాక్షన్లపై ఆఫర్లు, రిమైండర్లు.

భద్రతా ఫీచర్లు:

మల్టీ-లెవల్ సెక్యూరిటీ: బయోమెట్రిక్ లాగిన్, డివైస్ బైండింగ్ (రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మాత్రమే ట్రాన్సాక్షన్).

రియల్-టైమ్ అలర్ట్స్: అనుమానాస్పద లావాదేవీలను తక్షణమే గుర్తించి హెచ్చరిక.

UPI పిన్ అథెంటికేషన్: ప్రతి ట్రాన్సాక్షన్‌కు సురక్షితం.


ఇవీ చదవండి:

ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రాజెక్టు.. ఇల్లు అప్పగించని పౌరుడు.. చివరకు..

వాయుకాలుష్యం నుంచి తక్షణ ఉపశమనం.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

Updated Date - Dec 24 , 2025 | 10:25 AM