Share News

Bank Nominees: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

ABN , Publish Date - Oct 23 , 2025 | 06:42 PM

బ్యాంకు ఖాతాల నామినీలకు సంబంధించి నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఖాతాదారులు ఇకపై గరిష్ఠంగా నలుగురిని తమ అకౌంట్‌ నామినీలుగా పేర్కొనవచ్చు.

Bank Nominees: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. నవంబర్ 1 నుంచి నామినీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెల నుంచి బ్యాంకు ఖాతాదారులు గరిష్ఠంగా నలుగురు నామినీలను పేర్కొనవచ్చు. తాజా నిబంధనల ప్రకారం, ఖాతాదారు మరణానంతరం అకౌంట్‌లోని సొమ్మును నలుగురు నామినీలకు సమానంగా చెందేలా ఏర్పాటు చేయొచ్చు. లేదా ఒక నామినీ మరణానంతరం మరొకరికి చెందేలా ఏర్పాటు చేయొచ్చు. లాకర్లలోని వస్తువులకు ఇదే నిబంధన వర్తిస్తుంది (Bank Nominee New Rules).


బ్యాంకింగ్ చట్టాలకు సంబంధించిన సవరణలను కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ లోనే నోటిఫై చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్-1934, బ్యాకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్-1955, బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్‌లకు కేంద్రం మొత్తం 19 సవరణలు చేసినట్టు నోటీఫై చేసింది. వీటిలో కొన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాగా మిగిలినవి వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. నామినీల క్లెయిమ్ సెటిల్మెంట్‌లను మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం ఈ సవరణలను తీసుకొచ్చింది.


ఇవీ చదవండి:

ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..

రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 23 , 2025 | 07:42 PM