Share News

త్వరలో ఈ-రిక్షా మార్కెట్లోకి బజాజ్‌

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:42 AM

బజాజ్‌ ఆటో మార్చి చివరి నాటికి ఈ-రిక్షా విభాగంలోకి ప్రవేశిస్తోంది. నెలకి 45,000 యూనిట్ల పరిమాణం గల ఈ మార్కెట్‌ ప్రస్తుతం అత్యంత అవ్యవస్థీకృతంగా...

త్వరలో ఈ-రిక్షా మార్కెట్లోకి బజాజ్‌

న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో మార్చి చివరి నాటికి ఈ-రిక్షా విభాగంలోకి ప్రవేశిస్తోంది. నెలకి 45,000 యూనిట్ల పరిమాణం గల ఈ మార్కెట్‌ ప్రస్తుతం అత్యంత అవ్యవస్థీకృతంగా ఉందని, మార్చి త్రైమాసికం ముగిసేలోగా నియంత్రణాపరమైన అనుమతులు తీసుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ శర్మ తెలిపారు. అను మతులు రాగానే ‘‘ఈ-రిక్‌’’ మోడల్‌ విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు. ఏప్రిల్‌ తొలివారం నుంచి అమ్మకాలు ప్రారంభించాలన్నది తమ ఆలోచన అని తెలిపారు.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 10 , 2025 | 05:47 AM