Share News

సవాళ్లున్నా ఆటో ముందుకే

ABN , Publish Date - May 02 , 2025 | 02:57 AM

తీవ్ర సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా ఆటో రంగం అమ్మకాలను పెంచుకుంది. ఏప్రిల్‌ నెలలో మారుతి సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) కార్ల అమ్మకాలు పెరిగాయి...

సవాళ్లున్నా ఆటో ముందుకే

న్యూఢిల్లీ: తీవ్ర సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా ఆటో రంగం అమ్మకాలను పెంచుకుంది. ఏప్రిల్‌ నెలలో మారుతి సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) కార్ల అమ్మకాలు పెరిగాయి. అయితే టాటా మోటార్స్‌, హ్యుండయ్‌ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన తగ్గాయి. దీంతో ఇంతకాలం రెండో స్థానంలో ఉంటూ వచ్చిన హ్యుండయ్‌ మోటార్స్‌ ఆ స్థానాన్ని కోల్పోగా మహీంద్రాకు కోల్పోగా మూడో స్థానంలో టాటా మోటార్స్‌ నిలిచింది. కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా మొత్తం అమ్మకాలు ఏప్రిల్‌ నెలలో ఏడు శాతం పెరిగి 1,79,791కి చేరాయి. గత ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ 1,68,089 కార్లను విక్రయించింది. కాగా దేశీయ విక్రయాలు మాత్రం ఒక శాతం పెరిగి 1,37,952 నుంచి 1,38,704కి చేరాయి. ఎగుమతులు 22,160 యూనిట్ల నుంచి 27,911 యూనిట్లకు పెరిగాయి.


రెండు, మూడు స్థానాల్లోకి మహీంద్రా, టాటా

కంపెనీ విక్రయాలు వృద్ధి (%)

ఏప్రిల్‌ 2025 ఏప్రిల్‌ 2024

మహీంద్రా అండ్‌ మహీంద్రా 84,170 ---- 19

టాటా మోటార్స్‌ 45,199 47,883 - 6

హ్యుండయ్‌ మోటార్స్‌ 50,201 44,374 -12

కియా ఇండియా 23,623 19,968 18

టయోటా కిర్లోస్కర్‌ 27,324 20,494 33

జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్‌ 5,829 4,725 23

హోండా కార్స్‌ 3,360 4,351 -23

ద్విచక్ర వాహనాలు

సుజుకీ మోటార్‌ సైకిల్‌ 1,12,948 99,377 14

టీవీఎస్‌ మోటార్‌ 4,43,896 3,83,615 16

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 86,559 82,043 6

ఇవి కూడా చదవండి

Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..

Vijay Devarakonda: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్.. హీరో విజయ్ దేవరకొండపై కేసు

Updated Date - May 02 , 2025 | 02:58 AM