Share News

ఆటో డీలా

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:58 AM

మార్కెట్లో కార్లకు డిమాండ్‌ భారీగా తగ్గింది. ఫలితం గా జూన్‌ నెలలో ఆటో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఆటో రంగ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా, టాటా మోటార్స్‌ అమ్మకాల్లో...

ఆటో డీలా

న్యూఢిల్లీ: మార్కెట్లో కార్లకు డిమాండ్‌ భారీగా తగ్గింది. ఫలితం గా జూన్‌ నెలలో ఆటో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఆటో రంగ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా, టాటా మోటార్స్‌ అమ్మకాల్లో రెండంకెల క్షీణతను నమోదు చేశాయి. చిన్న కార్లకు ఆదరణ తగ్గడమే అమ్మకాల్లో ఈ భారీ క్షీణతకు కారణం. మారుతి సుజుకీ..గత నెలలో 1.18,906 కార్లను మాత్రమే విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 1,37,160 యూనిట్ల విక్రయాలతో పోల్చితే ఇది 13 శాతం తక్కువ. మినీ కార్‌ విభాగంలోకి వచ్చే ఆల్టో, ఎస్‌-ప్రెసో కార్ల అమ్మకాలు గత ఏడాది జూన్‌తో పోల్చితే 9,395 యూనిట్ల నుంచి 6,414 యూనిట్లకు పడిపోయాయి. కాంపాక్ట్‌, యుటిలిటీ వాహనాల అమ్మకాలు కూడా నిరాశావహంగానే ఉన్నాయి. మరోవైపు హ్యుండ య్‌ మోటార్‌ ఇండియా అమ్మకాలు 12 శాతం క్షీణించి 50,103 నుంచి 44,024 కార్లకు పరిమితం అయ్యాయి.

జూన్‌ అమ్మకాల్లో రెండంకెల క్షీణత

కంపెనీ అమ్మకాలు అమ్మకాలు క్షీణత/

(జూన్‌ 2025) (జూన్‌2024) వృద్ధి (%)

టాటా మోటార్స్‌ 37,083 43,524 - 15

ఆడి 2,128 2,477 - 14

మహీంద్రా 47,306 40,022 + 18

టీకేఎం 28,869 27,474 + 5

జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ 5,829 --- + 21

టూవీలర్‌ కంపెనీలు

బజాజ్‌ ఆటో 1,88,460 2,16,451 - 13

టీవీఎస్‌ మోటార్‌ 2,81,012 2,55,734 + 10

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 76,957 66,117 + 16

హోండా మోటార్‌ సైకిల్‌ 4,29,247 5,18,799 - 17

ఇవీ చదవండి:

మీ వ్యక్తిగత రుణాన్ని ఈ 5 మార్గాలతో ఈజీగా తీర్చుకోండి

వర్షంలో స్మార్ట్‌ఫోన్ ఇలా ఉపయోగిస్తున్నారా.. డేంజర్ జాగ్రత్త..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 04:58 AM