Share News

Indian stock market: ఆటో ఫార్మా షేర్లలో కొనుగోళ్లు

ABN , Publish Date - Jul 16 , 2025 | 03:41 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. వాహన, ఔషధ రంగ షేర్లలో కొనుగోళ్లతో ప్రామాణిక సూచీలు మంగళవారం లాభాల్లో పయనించాయి...

Indian stock market: ఆటో ఫార్మా షేర్లలో కొనుగోళ్లు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. వాహన, ఔషధ రంగ షేర్లలో కొనుగోళ్లతో ప్రామాణిక సూచీలు మంగళవారం లాభాల్లో పయనించాయి. ఒక దశలో 490 పాయింట్ల వరకు పుంజుకున్న సెన్సెక్స్‌.. చివరికి 317.45 పాయింట్ల వృద్ధితో 82,570.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 113.50 పాయింట్ల పెరుగుదలతో 25,195.80 వద్ద స్థిరపడింది.

20 కోట్లకు చేరువలో డీమ్యాట్‌ ఖాతాలు: స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే చిన్న మదుపరులు భారీగా పెరిగారని, దాంతో దేశంలో డీమ్యాట్‌ ఖాతాలు 20 కోట్లకు చేరువయ్యాయని సెబీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రుచి చోజెర్‌ తెలిపారు. 2019లో 3.6 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలుండగా.. 2025లో ఈ సంఖ్య 19.4 కోట్లకు పెరిగిందన్నారు.

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..

సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 03:41 AM