133 దేశాలకు అరబిందో హెచ్‌ఐవీ ఔషధం
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:58 AM
ప్రపంచంలోని 133 దేశాల్లో హెచ్‌ఐవీ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ కాబోటెగ్రవిర్‌ను అరబిందో ఫార్మా తయారుచేసి, సరఫరా చేయనుంది. మెడిసిన్స్ పేటెంట్ పూల్...
హైదరాబాద్: ప్రపంచంలోని 133 దేశాల్లో హెచ్‌ఐవీ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ కాబోటెగ్రవిర్‌ను అరబిందో ఫార్మా తయారుచేసి, సరఫరా చేయనుంది. మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ), వీఐఐవీ హెల్త్‌కేర్ మధ్య విస్తరించిన వాలంటరీ లైసెన్సింగ్ ఒప్పందం కింద కాబోటెగ్రవిర్ తయారు చేసేందుకు ఎంపి క చేసిన జెనరిక్ ఔషధ తయారీదారుల్లో అరబిందో ఒకటి. హెచ్‌ఐవీ రోగులు రోజువారీ మాత్రలు మింగడాన్ని ఈ చికిత్స నివారిస్తుంది. అందుకు బదులుగా వారు 1 లేదా 2 నెలలకి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఔషధం అభివృద్ధి, తయారీ, పంపిణీకి సబ్ లైసెన్స్ లభించడం ఆనందదాయకమని కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ నిత్యానందరెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి:
క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..
సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి