Share News

జి ఎస్ టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

ABN , Publish Date - May 02 , 2025 | 03:33 AM

ఏప్రిల్‌లో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.2.37 లక్షల కోట్లకు పెరిగాయు. 2024 ఏప్రిల్‌లో నమోదైన రూ.2.10 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే 12.6 శాతం వృద్ధి...

జి ఎస్ టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

  • ఏప్రిల్‌లో రూ.2.37 లక్షల కోట్లకు చేరిక

  • వార్షిక ప్రాతిపదికన 12.6 శాతం వృద్ధి

జి ఎస్ టీ చరిత్రలో నెలవారీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు దాటడం ఇది రెండో సారి

న్యూఢిల్లీ: ఏప్రిల్‌లో వస్తు, సేవల పన్ను (జి ఎస్ టీ ) స్థూల వసూళ్లు సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.2.37 లక్షల కోట్లకు పెరిగాయు. 2024 ఏప్రిల్‌లో నమోదైన రూ.2.10 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే 12.6 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడంతోపాటు వ్యాపారుల ఆర్థిక సంవత్సరాంతర సర్దుబాట్లు ఇందుకు దోహదపడ్డాయి. ఎందుకంటే, వ్యాపారులు మార్చి నెల ఆర్థిక లావాదేవీలపై జి ఎస్ టీ ని ఏప్రిల్‌లో చెల్లిస్తారు. 2017 జూలై నుంచి జీఎ్‌సటీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి నెలవారీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటడం ఇది రెండోసారి. వసూళ్లలో రెండో అత్యధిక రికార్డుతో పాటు గతంలో రూ.2 లక్షల కోట్లకు పైగా వసూళ్లు కూడా క్రితం ఏడాది ఏప్రిల్‌లోనే నమోదు కావడం గమనార్హం. కాగా, ఈ మార్చిలో వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లుగా ఉంది.


ఆర్థిక జోరుకు సంకేతం: కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నెలలో దేశీయ లావాదేవీల ద్వారా జి ఎస్ టీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10.7 శాతం పెరిగి రూ.1.90 లక్షల కోట్లకు చేరాయి. వస్తు దిగుమతులపై పన్ను రాబడి 20.8 శాతం వృద్ధి చెంది రూ.46,913 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.27,341 కోట్ల పన్నును రిఫండ్‌ చేసింది. ఈ రిఫండ్‌ సర్దుబాటు అనంతరం జి ఎస్ టీ నికర వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 9.1 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లుగా ఉన్నాయి.ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే జీఎ్‌సటీ నికర ఆదాయం రూ.2 లక్షల కోట్లు దాటడం ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరుకు సంకేతమని డెలాయిట్‌ ఇండియా భాగస్వామి ఎంఎస్‌ మణి అన్నారు.

జి ఎస్ టీ ఆదాయ తాజా గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకత, సహకార సమాఖ్యవాద ప్రభావానికి నిదర్శనం. వసూళ్లు రికార్డు స్థాయికి చేర్చటంలో పాలు పంచుకున్న పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు. పన్ను వసూళ్ల వృద్ధిలో కేంద్ర, రాష్ట్ర జీఎ్‌సటీ అధికారుల పాత్ర ఎంతో ఉంది.

-నిర్మలా సీతారామన్‌,

కేంద్ర ఆర్థిక మంత్రి


1.5 కోట్లు దాటిన జి ఎస్ టీరిజిస్ట్రేషన్లు

గత ఆర్థిక సంవత్సరం (2024-25) చివరి నాటికి జీఎ్‌సటీ నెట్‌వర్క్‌లోని రిజిస్టర్డ్‌ వ్యాపారుల సంఖ్య 1.5 కోట్లు దాటింది. అందులో 25 లక్షల మంది 2024-25లో రిజిస్టర్‌ చేసుకున్నారు. కాగా, ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడులో 10 లక్షల చొప్పున జీఎ్‌సటీ రిజిస్టర్డ్‌ వ్యాపారులున్నారు.

ఇవి కూడా చదవండి

Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..

Vijay Devarakonda: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్.. హీరో విజయ్ దేవరకొండపై కేసు

Updated Date - May 01 , 2025 | 09:49 PM

Updated Date - May 02 , 2025 | 03:33 AM