Share News

అపోలో మైక్రో సిస్టమ్స్‌ రికార్డు లాభం

ABN , Publish Date - May 26 , 2025 | 05:38 AM

అపోలో మైక్రోసిస్టమ్స్‌ కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో రికార్డు ఆదాయం, లాభాలు ప్రకటించింది. ముందు ఏడాదితో పోల్చితే ఆదాయం 51 శాతం పెరిగి...

అపోలో మైక్రో సిస్టమ్స్‌ రికార్డు లాభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అపోలో మైక్రోసిస్టమ్స్‌ కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో రికార్డు ఆదాయం, లాభాలు ప్రకటించింది. ముందు ఏడాదితో పోల్చితే ఆదాయం 51 శాతం పెరిగి రూ.372 కోట్ల నుంచి రూ.562 కోట్లకు చేరింది. నికరలాభం అయితే 81 శాతం వృద్ధితో రూ.56 కోట్లుగా నమోదయింది. మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.162.50 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.13.96 కోట్ల నికరలాభం ఆర్జించింది. 2025 ఆర్థిక సంవత్సరం తమ కంపెనీ చరిత్రలో ప్రత్యేకమైనదని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బద్దం కరుణాకర్‌ రెడ్డి అన్నారు. ప్రధానంగా ఐడీఎల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కొనుగోలు ఒక కీలక మైలురాయి అని చెప్పారు. ఇది తమను రక్షణ రంగానికి చెందిన సమీకృత టయర్‌-1 ఓఈఎంగా మార్చుతుందన్నారు. రాబోయే రెండేళ్ల కాలంలో తాము ఆదాయంలో 45-50 శాతం సంచిత వార్షిక వృద్ధిని (సీఏజీఆర్‌) ఆశిస్తున్నామని చెప్పారు.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:38 AM