Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్‌తో నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ జట్టు
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:07 AM
విమానాశ్రయ ఉద్యోగులు, ప్రయాణికులకు నిరంతరాయంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలందించేందుకు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంతో (ఎన్‌ఎంఐఏఎల్) అపోలో హాస్పిటల్స్...
ముంబై: విమానాశ్రయ ఉద్యోగులు, ప్రయాణికులకు నిరంతరాయంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలందించేందుకు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంతో (ఎన్‌ఎంఐఏఎల్) అపోలో హాస్పిటల్స్ చేతులు కలిపింది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు డిసెంబరు ప్రథమార్ధం నుంచి ప్రారంభమవుతాయి. ఉభయ సంస్థల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం విమానాశ్రయం టెర్మినల్ 1లో అపోలో హాస్పిటల్స్ 24 గంటలూ పని చేసే ఒక వైద్య కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ కేంద్రంలో ఎమర్జెన్సీ వైద్య సేవలతో పాటు వైపరీత్య నిర్వహణా సదుపాయాలు కూడా ఉంటాయని అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఇదిలా ఉండగా ఏ క్షణంలో అయినా స్పందించేందుకు వీలుగా ఎన్‌ఎంఐఏఎల్‌లో రెండు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) అంబులెన్స్‌లను విమానాశ్రయం వద్ద ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి