బంగారం మరో రికార్డు
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:50 AM
దేశీయంగా బంగారం, వెండి ధరలు సరికొత్త జీవనకాల రికార్డు గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర సోమవారం రూ.1,300 పెరుగుదలతో...
ఒక్కరోజే రూ.1,300 అప్, తులం రూ.90,750
న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం, వెండి ధరలు సరికొత్త జీవనకాల రికార్డు గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర సోమవారం రూ.1,300 పెరుగుదలతో రూ.90,750కి చేరింది. 99.5 స్వచ్ఛత లోహం రేటు సైతం అదే స్థాయిలో పెరిగి రూ.90,350కి చేరుకుంది. పసిడి ధర పెరగడం వరుసగా ఇది నాలుగో రోజని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. కిలో వెండి కూడా రూ.1,300 పెరుగుదలతో రూ.1,02,500 ధర పలికింది. ట్రంప్ సుంకాల వడ్డన కారణంగా అంతర్జాతీయంగా పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలతో పాటు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వచ్చే సమీక్షలో ప్రామాణిక వడ్డీరేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలతో ఇంటర్నేషనల్ మార్కెట్లో వీటి ధరలు పెరగడమే ఇందుకు కారణం. గత శుక్రవారం ట్రేడింగ్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం తొలిసారిగా 3,000 డాలర్ల మైలురాయిని దాటింది. ఒకదశలో 3,017 డాలర్లకు ఎగబాకింది. కాగా, మళ్లీ కాస్త తగ్గి 2,995 డాలర్లకు పరిమితమైంది. సిల్వర్ 34.06 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
ఈ ఏడాదిలో రూ.11,000 అప్ : ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధర రూ.11,360 (14.31 శాతం) పెరిగింది. ఈ జనవరి 1న రూ.79,390 పలికిన తులం బంగారం.. ప్రస్తుతం రూ.90,750కి ఎగబాకింది. వాణిజ్య అనిశ్చితులు మరింత పెరిగితే, మున్ముందు పసిడి మరింత పుంజుకోవచ్చని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ గోల్డ్ 3,300 డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలున్నాయి. అదే గనక జరిగితే, దేశీయంగా తులం బంగారం రూ.లక్ష దాటడం ఖాయం.
ఇవి కూడా చదవండి:
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Gold Silver Rates Today: గుడ్ న్యూస్..రెండో రోజు కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News