‘మెటా’లో మరో 3,600 మంది ఔట్
ABN , Publish Date - Jan 16 , 2025 | 05:38 AM
అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, థ్రెడ్స్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ ఉద్యోగాల కోతకు దిగింది...

వాషింగ్టన్: అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, థ్రెడ్స్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ ఉద్యోగాల కోతకు దిగింది. తన ఉద్యోగుల్లో ఐదు శాతం మందిని పనితీరు బాగోలేదనే పేరుతో ఇంటికి పంపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం మెటాలో ప్రపంచ వ్యాప్తంగా 72,000 మంది పని చేస్తున్నారు. వీరిలో ఐదు శాతం అంటే 3,600 మంది త్వరలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. అమెరికాలోని ఉద్యోగుల కు ఈ నెల 10వ తేదీనే ఈ విషయం తెలిపారు. ఇతర దేశాల్లోని ఉద్యోగులకూ త్వరలోనే ఈ వార్త అందనుంది.