Share News

వచ్చే దశాబ్దిలో రూ.8.5 లక్షల కోట్లు

ABN , Publish Date - May 02 , 2025 | 03:19 AM

దేశంలో మీడియా, వినోద రంగం వచ్చే దశాబ్ది కాలంలో మూడు రెట్లు పెరిగి 10 వేల కోట్ల డాలర్లకు (రూ.8.5 లక్షల కోట్లు) చేరవచ్చని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అన్నారు...

వచ్చే దశాబ్దిలో రూ.8.5 లక్షల కోట్లు

మీడియా, వినోద రంగంపై అంబానీ అంచనా

ముంబై: దేశంలో మీడియా, వినోద రంగం వచ్చే దశాబ్ది కాలంలో మూడు రెట్లు పెరిగి 10 వేల కోట్ల డాలర్లకు (రూ.8.5 లక్షల కోట్లు) చేరవచ్చని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అన్నారు. ప్రస్తుతం ఈ రంగం పరిమాణం 2800 కోట్ల డాలర్లుగా (రూ.2.38 లక్షల కోట్లు) ఉంది. దేశంలో అతిపెద్ద మీడియా సంస్థ నెట్‌వర్క్‌ 18 అధిపతి కూడా అయిన అంబానీ ముంబైలో గురువారం ప్రారంభమైన వేవ్స్‌ 2025 సదస్సులో మాట్లాడుతూ.. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి లక్షల్లో ఉద్యోగావకాశాలు కల్పించగల సామర్థ్యం ఉన్నదని అన్నారు. వీటి అనుకూల ప్రభావం ఇతర రంగాలపై కూడా ఉంటుందని తెలిపారు. కథలు వినిపించడం, డిజిటల్‌ టెక్నాలజీ విభాగాలు రెండింటిలోనూ భారత్‌కు కీలక స్థానం ఉన్నదని, ఇవి వ్యూహాత్మకంగా కీలకమైనవని చెప్పారు. ఏఐ, ఇమ్మెర్సివ్‌ టెక్నాలజీలు కథలు చెప్పడాన్ని మరింత సజీవం చేస్తాయని, అన్ని భాషల ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తాయని అంబానీ అన్నారు. ఈ సాధనాలు వినియోగించుకోవడం ద్వారా భారత్‌కు చెందిన అత్యంత ప్రతిభావంతులైన యువ క్రియేటర్లు ప్రపంచ వినోద రంగానికి బ్లాక్‌బస్టర్లు అందించవచ్చని సూచించారు.


తీవ్ర అస్థిరతలు, కల్లోలాలతో కూడిన ప్రస్తుత ప్రపంచంలో మన కథలు భవిష్యత్తుకు ఆశాజ్యోతిగా నిలుస్తాయని, అవి అందరినీ ఐక్యం చేసి స్ఫూర్తిని, చైతన్యాన్ని నింపుతాయని ఆయన అన్నారు. ఐదు వేల సంవత్సరాల నాగరిక వైభవం గల మన దేశం ప్రపంచానికి రామాయణ, మహాభారతాలను, అద్భుతమైన జానపద గేయాలను అందించిందని అంబానీ చెప్పారు.


ఐపీవో బాటలో కరోనా రెమెడీస్ లిమిటెడ్

క్రిస్‌క్యాపిటల్ అనుబంధ సంస్థ సెపియా ఇన్వెస్ట్‌మెంట్స్ దన్ను గల ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ కంపెనీ అయిన కరోనా రెమెడీస్ లిమిటెడ్ తమ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. దీని ప్రకారం కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ విధానంలో మొత్తం రూ. 800 కోట్లు సమీకరించనుంది. ఇష్యూ కింద జారీ చేసే షేర్లు బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అవుతాయి. మహిళల ఆరోగ్య సంరక్షణ, కార్డియో-డయాబెటో, నొప్పి నివారణ, యూరాలజీ తదితర ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తోంది. జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ (గతంలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్), కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..

Vijay Devarakonda: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్.. హీరో విజయ్ దేవరకొండపై కేసు

Updated Date - May 02 , 2025 | 10:24 PM