అమర రాజా లాభంలో 11 శాతం వృద్ధి
ABN , Publish Date - Feb 10 , 2025 | 05:52 AM
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ.. డిసెంబరుతో ముగిసి న త్రైమాసిక లాభంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,272.47 కోట్ల ఆదాయంపై రూ.298.37 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది....

అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ.. డిసెంబరుతో ముగిసి న త్రైమాసిక లాభంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,272.47 కోట్ల ఆదాయంపై రూ.298.37 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.267.89 కోట్లు)తో పోల్చితే లాభం 11 శాతం వృద్ధి చెందింది. కాగా డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి గాను రూ.9,786.25 కోట్ల ఆదాయంపై రూ.783.10 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన అమర రాజా ఎనర్జీ డిసెంబరు త్రైమాసికంలో రూ.3,164.02 కోట్ల ఆదాయంపై రూ.311.83 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..