Share News

తగ్గిన అమర రాజా ఎనర్జీ లాభం

ABN , Publish Date - May 30 , 2025 | 03:54 AM

అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ.. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.161.57 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది...

తగ్గిన అమర రాజా ఎనర్జీ లాభం
Amar Raja Q4

ఒక్కో షేరుకు రూ.5.20 డివిడెండ్‌ సిఫారసు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ.. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.161.57 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.229.78 కోట్లు)తో పోల్చితే లాభం 29.7 శాతం క్షీణించింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.2,907.86 కోట్ల నుంచి రూ.3,060.07 కోట్లకు పెరిగింది. నిర్వహణా వ్యయాలు గణనీయంగా పెరగటం మార్చి త్రైమాసికంలో కంపెనీ పనితీరును దెబ్బతీసింది. కాగా మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12,961.91 కోట్ల రెవెన్యూపై రూ.944.67 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.5.20 (520 శాతం) తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.


ఇవీ చదవండి:

భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 10:43 AM