ఆల్ఫాబెట్ రూ.2.77 లక్షల కోట్ల డీల్
ABN , Publish Date - Mar 19 , 2025 | 05:31 AM
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ భారీ కొనుగోలు చేపడుతోంది. సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ ‘విజ్’ను 3,200 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2.77 లక్షల కోట్లు)...
సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ విజ్‌ను
కొనుగోలు చేసిన గూగుల్ మాతృ సంస్థ
న్యూయార్క్: అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ భారీ కొనుగోలు చేపడుతోంది. సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ ‘విజ్’ను 3,200 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2.77 లక్షల కోట్లు) చేజిక్కించుకోనుంది. ఈ డీల్ పూర్తిగా నగదు రూపంలో జరగనుంది. ప్రస్తుతం అమెజాన్, మైక్రోసా్‌ఫ్టలే ప్రధాన పోటీదారులుగా ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ సేవల మార్కెట్‌లో పట్టు సాధించేందుకు ఆల్ఫాబెట్‌కు ఈ కొనుగోలు దోహదపడనుంది. ‘‘ఈ రోజుల్లో క్లౌడ్ సేవలందుకుంటున్న వ్యాపారాలు, ప్రభుత్వాలు మరింత పటిష్ఠమైన సెక్యూరిటీ సొల్యూషన్స్‌తోపాటు క్లౌడ్ కంప్యూటింగ్ సేవల కంపెనీల్లో గొప్ప చాయిస్ కోసం చూస్తున్నాయ’’ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. గూగుల్ క్లౌడ్, విజ్ సమ్మేళనం క్లౌడ్ సెక్యూరిటీని అత్యంత బలోపేతం చేయడంతోపాటు పలు క్లౌడ్‌లను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని పెంచనుందన్నారు. న్యూయార్క్ కేంద్రంగా నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన విజ్.. క్లౌడ్ నెట్‌వర్క్స్ కోసం సెక్యూరిటీ పరిష్కారాలను డిజైన్ చేస్తుంది.
Read More Business News and Latest Telugu News