Indian Packaging Industry: ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లాభంలో 41 శాతం వృద్ధి
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:36 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లిమిటెడ్.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.89 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లిమిటెడ్.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.89 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.63 కోట్లు)తో పోల్చితే లాభం 41 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా 25 శాతం వృద్ధితో రూ.577 కోట్ల నుంచి రూ.721 కోట్లకు పెరిగింది. జూన్ త్రైమాసికంలో నిర్వహణాపరమైన సామర్థ్యాలను పెంచుకోవటం ఎంతగానో కలిసివచ్చిందని కంపెనీ పేర్కొంది. కాగా రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న కొత్త ప్లాంట్ 2027-28 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. అలాగే రూ.700 కోట్ల పెట్టుబడితో మధ్యప్రదేశ్‌లో నెలకొల్పుతున్న ప్లాంట్ 2027 మార్చి నాటికల్లా ప్రారంభం కానుందని పేర్కొంది.
ఇవీ చదవండి:
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా
ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి