Adani Group Wins Bid: జేపీ అసోసియేట్స్ రేసులో అదానీయే విజేత
ABN , Publish Date - Nov 20 , 2025 | 06:07 AM
ఆర్థికంగా దివాలా తీసిన జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) ఎట్టకేలకు అదానీ గ్రూప్ పరమైంది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ అసోయేట్స్ రుణదాతల కమిటీ (సీఓసీ) అదానీ గ్రూప్ సమర్పించిన...
రూ.14,535 కోట్ల బిడ్‌కు రుణదాతల కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ: ఆర్థికంగా దివాలా తీసిన జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) ఎట్టకేలకు అదానీ గ్రూప్ పరమైంది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ అసోయేట్స్ రుణదాతల కమిటీ (సీఓసీ) అదానీ గ్రూప్ సమర్పించిన రూ.14,535 కోట్ల బిడ్‌కే అమోదం తెలిపింది. ఇతర బిడ్డర్లతో పోలిస్తే, అధిక మొత్తంలో అప్‌ఫ్రంట్ చెల్లింపులు (రూ.6,005 కోట్లు) ఆఫర్ చేసిన అదానీ బిడ్‌కే సీఓసీ మొగ్గుచూపింది. జేపీ అసోసియేట్స్‌ను చేజిక్కించుకునేందుకు అదానీ గ్రూప్, వేదాంత, దాల్మియా సిమెంట్స్ పోటీపడ్డాయి. ఈ మూడింటిలో అదానీ బిడ్‌కు 89 శాతం ఓట్లు వచ్చినట్లు తెలిసింది. దాల్మియా సిమెంట్, వేదాంత బిడ్లు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. జేపీ అసోసియేట్స్ రియల్టీ, సిమెంట్ తయారీ, ఆతిథ్య సేవలు, విద్యుత్, ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ రంగాల్లోకి విస్తరించింది. రుణదాతలకు రూ.57,185 కోట్లు బకాయిల చెల్లింపుల్లో విఫలమవడంతో గత ఏడాది జూన్‌లో ఈ గ్రూప్‌పై కార్పొరేట్ దివాలా పరిష్కార చర్యలు ప్రారంభమయ్యాయి.
ఏడబ్ల్యూఎల్‌లో మరో 13 శాతం వాటా విక్రయం : అదానీ గ్రూపు ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్‌లో (గతంలో అదానీ విల్మర్ లిమిటెడ్) మరో 13ు వాటాను విల్మర్ ఇంటర్నేషనల్‌కు విక్రయించింది. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ కమోడిటీస్ ఎల్‌ఎల్‌పీ ఈ కంపెనీలో 13ు వాటాకు సమానమైన 16.9 కోట్ల ఈక్విటీ షేర్లను విల్మర్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ లెన్స్ పీటీఈ లిమిటెడ్‌కు విక్రయించింది. తదనంతరం ఏడబ్ల్యూఎల్‌లో అదానీ కమోడిటీస్ వాటా 20ు నుంచి 7 శాతానికి తగ్గగా.. లెన్స్ పీటీఈ లిమిటెడ్ వాటా 56.94 శాతానికి పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం నుంచి వైదొలిగి మౌలిక రంగ పోర్ట్‌ఫోలియోపై ప్రధానంగా దృష్టిని కొనసాగించే వ్యూహంలో భాగం గా ఏడబ్ల్యూఎల్‌లో 20ు వాటాను విల్మర్‌కు రూ.7,150 కోట్లకు విక్రయించనున్నట్లు అదానీ గ్రూప్ ఈ జూలైలోనే ప్రకటించింది.
బొండాడతో అదానీ ఒప్పందం
హైదరాబాద్‌కు చెందిన బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్‌తో అదానీ గ్రూప్ దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో ఉన్న అదానీ గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎండీ, సీఈఓ వినీత్ జైన్, బొండాడ ఇంజనీరింగ్ చైర్మన్/ఎండీ బీ రాఘవేంద్ర రావు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా అదానీ గ్రూప్ నిర్మించే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు బొండాడ ఇంజనీరింగ్ వ్యూహాత్మక డిజైన్, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ ఒప్పందం తొలి విడతలో భాగంగా అదానీ గ్రూప్ 650 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు పనులను బొండాడకు అప్పగించింది.
ఇవి కూడా చదవండి..
ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..
టీవీకే సభ్యులకు క్యూ ఆర్ కోడ్‌తో గుర్తింపు కార్డులు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..