సిటీ యూనియన్ బ్యాంక్‌కు 7 టెక్నాలజీ అవార్డులు
ABN , Publish Date - Jan 28 , 2025 | 03:54 AM
సిటీ యూనియన్ బ్యాంక్ (సీయూబీ).. ఐబీఏ బ్యాంకింగ్ టెక్నాలజీలో ఏడు అవార్డులను గెలుచుకుంది. ఇటీవల ముంబైలో జరిగిన 20వ వార్షిక టెక్నాలజీ కాన్ఫరెన్స్, ఎక్స్‌పో-2024లో బ్యాంక్ ఏడు విభాగాల్లో...
హైదరాబాద్: సిటీ యూనియన్ బ్యాంక్ (సీయూబీ).. ఐబీఏ బ్యాంకింగ్ టెక్నాలజీలో ఏడు అవార్డులను గెలుచుకుంది. ఇటీవల ముంబైలో జరిగిన 20వ వార్షిక టెక్నాలజీ కాన్ఫరెన్స్, ఎక్స్‌పో-2024లో బ్యాంక్ ఏడు విభాగాల్లో ఈ అవార్డులను దక్కించుకుంది. ఐబీఏ నుంచి సీయూబీ వరుసగా ఏడు విభాగాల్లో ఈ అవార్డులను అందుకోవటం ఇది రెండో ఏడాది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ చేతుల మీదుగా సిటీ యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ ఆనంద్, బ్యాంక్ టెక్నికల్ టీమ్ ఈ అవార్డులను అందుకున్నారు. డిజిటల్ సేల్స్, పేమెంట్స్ అండ్ ఎంగేజ్‌మెంట్, ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్, ఫిన్‌టెక్ అండ్ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ (డీపీఐ) అడాప్షన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఏఐ అండ్ ఎంఎల్ వినియోగించటం, టెక్నాలజీ టాలెంట్, అత్యుత్తమ టెక్నాలజీ బ్యాంక్ విభాగాల్లో సీయూబీ ఈ అవార్డులను గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి:
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..