7 సీస్ నుంచి కొత్త ఆన్‌లైన్ గేమ్‌లు
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:00 AM
ఆన్‌లైన్ గేమింగ్‌లో అగ్రగామి అయిన 7 సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ విశేష జనాదరణ ఉన్న మూడు కొత్త గేమ్‌లను ప్రవేశపెట్టింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆన్‌లైన్ గేమింగ్‌లో అగ్రగామి అయిన 7 సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ విశేష జనాదరణ ఉన్న మూడు కొత్త గేమ్‌లను ప్రవేశపెట్టింది. అవి వరల్డ్ క్రికెట్ చాంపియన్ లీగ్, ప్రపంచ గుర్రపు స్వారీ, కేక్ మ్యాచ్:పజిల్ తరహా గేమ్. అలాగే www.onlinerealgames.comసైట్‌ను పునః ప్రారంభించింది. కొత్తగా ప్రవేశపెట్టినవన్నీ దేశీయంగానే అభివృద్ధి చేసిన ఉచిత గేమ్‌లని తెలిపింది. వాటిని ప్లేస్టోర్, యాప్ స్టోర్, ఇండస్ యాప్ స్టోర్ల నుంచి దిగుమతి చేసుకోవచ్చునని తెలియచేసింది. గేమర్లకు అత్యుత్తమమైన మొబైల్ గేమింగ్ అనుభవం అందించడం తమ లక్ష్యమని 7 సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ ఎండీ ఎల్‌ఎం శంకర్ తెలిపారు.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి