Share News

ఆటో ఎక్స్‌పోలో 40 కొత్త మోడళ్ల విడుదల

ABN , Publish Date - Jan 08 , 2025 | 03:15 AM

ఈ నెల మూడో వారంలో న్యూఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2025లో 40 కొత్త వాహనాలు విడుదలయ్యే ఆస్కారం ఉన్నట్టు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025 పేరిట ఈ ప్రదర్శన...

ఆటో ఎక్స్‌పోలో   40 కొత్త మోడళ్ల విడుదల

న్యూఢిల్లీ: ఈ నెల మూడో వారంలో న్యూఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2025లో 40 కొత్త వాహనాలు విడుదలయ్యే ఆస్కారం ఉన్నట్టు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025 పేరిట ఈ ప్రదర్శన ఈ నెల 17 నుంచి 22 వరకు జరగనుంది. ఈ ఎక్స్‌పోలో విడుదల చేస్తారనుకుంటున్న వాహనాల్లో ద్విచక్ర వాహనాలు, ప్రయాణికుల వాహనాలు, బస్సులు ఉన్నట్టు వారు చెబుతున్నారు. వీసాల సమస్య కారణంగా ఈ ఏడాది ఎక్స్‌పోలో భారీ సంఖ్యలో చైనా కంపెనీలు పాల్గొనే ఆస్కారం ఉండకపోవచ్చని వాణిజ్య, పరిశ్రమల శాఖ జాయింట్‌ సెక్రటరీ విమల్‌ ఆనంద్‌ చెప్పారు. గత ఏడాది ఎక్స్‌పో మొత్తం భారత్‌ మండపంలోనే జరిగిందని, కాని ఈ ఏడాది యశోభూమి, గ్రేటర్‌ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌ అండ్‌ మార్ట్‌లలో కూడా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఎక్స్‌పోకు అదనంగా బ్యాటరీ షో, టైర్‌ షో, ఎలక్ర్టానిక్స్‌ షో, కాంపోనెంట్స్‌ షో వంటివి కూడా జరుగుతాయని ఆయన చెప్పారు.

Updated Date - Jan 08 , 2025 | 03:15 AM