Share News

రెండేళ్లలో 4 లక్షల ఈవీ

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:26 AM

దేశంలో విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం ‘‘ఓపెన్‌ కొలాబరేషన్‌ 2.0’’ కార్యక్రమాన్ని టాటా.ఈవీ ప్రకటించింది. రెండేళ్లలో దేశవ్యాప్తంగా...

రెండేళ్లలో 4 లక్షల ఈవీ

చార్జింగ్‌ పాయింట్లు : టాటా ఈవీ

న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం ‘‘ఓపెన్‌ కొలాబరేషన్‌ 2.0’’ కార్యక్రమాన్ని టాటా.ఈవీ ప్రకటించింది. రెండేళ్లలో దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైబడి చార్జింగ్‌ పాయిం ట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా ప్రకటించింది. చార్జింగ్‌ పాయింట్‌ ఆపరేటర్లతో భాగస్వామ్యాలు పటిష్ఠం చేసుకోవడంతో పాటు అన్ని కంపెనీల ఈవీ కస్టమర్లకు ఉపయోగపడేలా 30,000 కొత్త పబ్లిక్‌ చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా టాటా పవర్‌, చార్జ్‌ సోన్‌, స్టాటిక్‌, జియోన్‌లతో భాగస్వామ్యాలపై సంతకాలు చేశామని; ఈ కేంద్రాలు అమిత వేగవంతమైన చార్జింగ్‌ సదుపాయం కల్పిస్తాయని టాటా.ఈవీ ప్రకటించింది. ప్రధాన నగరాలు, ప్రధాన రహదారులపై వీటిని ఏర్పాటు చేస్తారు.


For Business News And Telugu News

Updated Date - Feb 14 , 2025 | 01:26 AM