Share News

లైటింగ్‌ వ్యాపారంలో ఏటా 20% వృద్ధి

ABN , Publish Date - Jan 22 , 2025 | 03:11 AM

విప్రో కన్స్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌.. హైదరాబాద్‌లో మైవిప్రోవెర్స్‌ ఎక్స్‌క్లూజివ్‌ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను కంపెనీ...

లైటింగ్‌ వ్యాపారంలో ఏటా 20% వృద్ధి

విప్రో కన్స్యూమర్‌కేర్‌ అండ్‌ లైటింగ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విప్రో కన్స్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌.. హైదరాబాద్‌లో మైవిప్రోవెర్స్‌ ఎక్స్‌క్లూజివ్‌ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనుజ్‌ ధిర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్క్‌ ప్లేసెస్‌, ఇతర పారిశ్రామిక విభాగాలకు అవసరమైన సరికొత్త స్మార్ట్‌ లైటింగ్‌, సీటింగ్‌ ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దేశంలో ఈ తరహా షోరూమ్‌ను ఏర్పాటు చేయటం ఇదే తొలిసారన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో కొత్తగా 6-7 షోరూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ లైటింగ్‌ వ్యాపారం రూ.1,000 కోట్లుగా ఉందని, ఇది ఏటా 15-20 శాతం వృద్ధి చెందుతూ వస్తోందని అనుజ్‌ తెలిపారు. కాగా మొత్తం వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల వాటా 15 శాతంగా ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Updated Date - Jan 22 , 2025 | 03:11 AM