2 నెలల్లో ఎల్‌ఐసీకి రూ.1.50 లక్షల కోట్ల నష్టం
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:44 AM
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ.. దేశంలోనే అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ కూడా. పాలసీదారుల నుంచి ప్రీమియం రూపంలో సేకరించిన సొమ్ములో...

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ.. దేశంలోనే అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ కూడా. పాలసీదారుల నుంచి ప్రీమియం రూపంలో సేకరించిన సొమ్ములో కొంత భాగాన్ని కంపెనీ స్టాక్ మార్కెట్లోనూ పెట్టుబడిగా పెడుతుంది. మార్కెట్ పత నం కారణంగా ఈ ఏడాదిలో గడిచిన రెండు నెలల్లో ఎల్‌ఐసీకి ఏకంగా రూ.1.45 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. గత ఏడాది డిసెంబరు చివరి నాటికి, ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల మొత్తం విలువ రూ.14.9 లక్షల కోట్లు కాగా.. ఈ ఫిబ్రవరి చివరినాటికి రూ.13.4 లక్షల కోట్లకు తగ్గింది.