Share News

‘మోక్షగుండం’ను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:48 PM

ఇంజనీరింగ్‌రంగ పితా మహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని యువ ఇంజనీర్లు భవితకు బాట లు వేసుకోవాలని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేవీ జీడీ బాలాజీ అన్నారు.

‘మోక్షగుండం’ను ఆదర్శంగా  తీసుకోవాలి
మోక్షగుండం విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం

ఎచ్చెర్ల, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌రంగ పితా మహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని యువ ఇంజనీర్లు భవితకు బాట లు వేసుకోవాలని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేవీ జీడీ బాలాజీ అన్నారు. క్యాంపస్‌-2లో సోమవారం ఇంజ నీర్స్‌ డే సందర్భంగా మోక్షగుండం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్‌ యూని వర్సిటీ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌, శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలల్లోనూ ఇంజనీర్స్‌ డే నిర్వహించారు. కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

గాంధీ స్మ్మతి వనంలో..

శ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గాంధీ మందిర స్మృతి వనంలో ప్రముఖ ఇంజ నీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని సోమవారం నిర్వహించారు. విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. లయన్స్‌ క్లబ్‌ వివిధ విభాగాల ఆధ్వర్యంలో పలువురు ఇంజనీర్లకు సత్కరించారు. అనంతరం ఎన్విరాన్మెంటల్‌ కమిటీ చైర్మన్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 11:48 PM