పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం: ఎంజీఆర్
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:01 AM
ప్రభు త్వం పరిశ్రమల స్థాపనకోసం యువతకు ప్రో త్సహిస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.శుక్రవారం పాతపట్నంలో నైపుణ్యా భివృద్ధి సంస్థ జాబ్‌మేళాను నిర్వహించింది.
పాతపట్నం, అక్టోబరు24(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం పరిశ్రమల స్థాపనకోసం యువతకు ప్రో త్సహిస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.శుక్రవారం పాతపట్నంలో నైపుణ్యా భివృద్ధి సంస్థ జాబ్‌మేళాను నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.జాబ్‌మేళాలో రెడ్డీస్ రాయల్ ఎంఫీల్డ్, హెటిరో డ్రగ్స్‌తోపాటు పేరొందిన వివిధ 11 కంపెనీల ప్రతినిధులు ఇంటర్య్వూలను నిర్వహించారు. ఈ మేరకు 482 మందికి యువత హాజరుకాగా ఎంపికైన 301 మందికి నియామక ఉత్తర్వులు అందజేసినట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఉరిటి సాయికుమార్ తెలిపారు. కార్యక్ర మంలో సెట్‌శ్రీ సీఈవో ప్రసాద్, టీడీపీ నేతలు పైల బాబ్జీ, సతీష్, మధుబాబు, పలు కళాశాలలకు చెందిన తిరుపతిరావు, జగన్ పాల్గొన్నారు.