Share News

దేశం కోసం ‘అల్లూరి’ త్యాగనిరతి చిరస్మరణీయం

ABN , Publish Date - May 08 , 2025 | 12:40 AM

దేశం కోసం పోరాడి బ్రిటీషు వారిని ఎదురించి ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగనిరతి చిరస్మరణీయమని టీడీపీ మండల అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబురాజు అన్నారు.

 దేశం కోసం ‘అల్లూరి’ త్యాగనిరతి చిరస్మరణీయం

అల్లవరం, మే 7(ఆంధ్రజ్యోతి): దేశం కోసం పోరాడి బ్రిటీషు వారిని ఎదురించి ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగనిరతి చిరస్మరణీయమని టీడీపీ మండల అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబురాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బుధవారం రెల్లుగడ్డలో అల్లూరి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కోడూరుపాడు, గుండెపూడి, రెల్లుగడ్డ, కొమరగిరిపట్నం గ్రామాల్లో అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో నడింపల్లి సుబ్రహ్మణ్యంరాజు, డీఎస్‌ఎన్‌ రాజు, మంతెన సురేష్‌రాజు, దాట్ల గోపీరాజు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కడలి వెంకటేశ్వరరావు, గుంటూరి కృష్ణంరాజు, గుంటూరి బాలవెంకట్రాజు, గుంటూరి శ్రీనురాజు, బొక్కా నాగశివప్రసాద్‌, పచ్చిమాల ఏడుకొండలు, ఎం.రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:40 AM