Share News

రైతుబజారు ఏర్పాటుచేయాలి

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:50 PM

నియోజకవర్గ అభి వృద్ధికి సహకరించాలని వివిద శాఖల మంత్రులు, అధికారులను శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలి త కుమారి కోరారు. మంగళవారం విజయవాడలో ఆయాశాఖలకార్యా లయాలకు కలిశారు.

  రైతుబజారు ఏర్పాటుచేయాలి
రైతుబజారు ఏర్పాటుచేయాలని అచ్చెన్నాయుడుకు వివరిస్తున్న లలితకుమారి:

శృంగవరపుకోట, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ అభి వృద్ధికి సహకరించాలని వివిద శాఖల మంత్రులు, అధికారులను శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలి త కుమారి కోరారు. మంగళవారం విజయవాడలో ఆయాశాఖలకార్యా లయాలకు కలిశారు. కొత్తవలసలో రైతుబజారు ఏర్పాటు చేయాలని వ్యవసాయ, సహకార, మార్కెటిం గ్‌, మత్సకారశాఖ మంత్రి అచ్చెన్నా యుడుకు వినతిపత్రం అందించా రు.గిరిజన గ్రామాలకు రోడ్లు, మెరు గైన తాగునీటి సదుపాయంకల్పించాలని స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణికు విజ్ఞప్తిచేశారు. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు కొత్తబస్సులు కేటా యించాలని రవాణా, యువజన క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌కు విన్న వించారు. ఇంటింటికి తాగునీటి సరఫరాకు జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) నిధులు కేటాయించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ ఇన్‌చీఫ్‌ టి.గాయత్రిదేవికి లిఖిత పూర్వ కంగా విన్నవించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరామప్రసాద్‌, ఎల్‌.కోట మాజీ ఎంపీపీ కొల్లివెంకటరమణ మూర్తి, గవర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మళ్ల రామకృష్ణ, చింతలపాలెం సర్పంచ్‌ మాకిన నవీన్‌ పాత్రుడు, సాగర్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:50 PM