Share News

East Godavari: వైసీపీ సర్పంచ్‌ వేధింపులు..పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - May 21 , 2025 | 03:52 AM

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ సర్పంచ్ వెంకటరమణ పై పదోన్నతులు, భూమి ఆక్రమణ సమస్యలతో పీడితులైన కార్యదర్శి కె.విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఘటనపై విచారణ నిర్వహిస్తున్నారు.

East Godavari: వైసీపీ సర్పంచ్‌ వేధింపులు..పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

తూర్పుగోదావరి జిల్లా కాపవరంలో ఘటన

బిక్కవోలు, మే 20(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరం పంచాయతీ వైసీపీ సర్పంచ్‌ వెంకటరమణ వేధింపులు తాళలేక కార్యదర్శి కె.విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్‌ఐ వి.రవిచంద్రకుమార్‌ కథనం మేరకు. ‘విజయలక్ష్మి సోమవారం ఉదయం 10 గంటలకు బిక్కవోలు ఎంపీడీవో కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ నిమిత్తం వచ్చి పక్కరూమ్‌లో సిట్రిజన్‌ టాబ్లెట్లు మిగింది. అంతకు ముందు ఆమె మొబైల్‌ నుంచి సర్పంచ్‌ వెంకటరమణకు బిల్లుల విషయమై ఫోన్‌చేయగా దుర్భాషలాడి అవమానపరిచాడు. కాపవరం వెల్నెస్‌ సెంటర్‌కు కిటీకీలు, గుమ్మాల నిమిత్తం రూ.1,63,739 బిల్లును 15వ ఆర్థిక సంఘ నిధుల్లో పెట్టమని ఒత్తిడికి గురిచేస్తున్నాడు. సర్పంచ్‌ తమ్ముడు గ్రామపరిధిలో ఉన్న భూమిని ఆక్రమించి గేదెల షెడ్డు వేసుకున్నాడు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా ఖాళీ చేయడం లేదు. ప్రతి విషయంలోనూ అవమానపరుస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది’ అని ఎస్‌ఐ వివరించారు. ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఫోన్‌ చేయడంతో ఆమె భర్త వచ్చి అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చేర్చారని తెలిపారు. ఈ ఘటనపై రాజమహేంద్రవరం ఈస్ట్‌జోన్‌ డీఎస్పీ బి.విద్య మంగళవారం విచారణ జరిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 03:52 AM