Tummati Madhavarao: తెలుగు మీడియం చదివితే ఉద్యోగాలు వస్తాయా?
ABN , Publish Date - Feb 26 , 2025 | 06:10 AM
తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగునే కించపరిచేవిధంగా మాట్లాడతారా? ఆ మాటలను వెనక్కి తీసుకోవాలంటూ మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి వ్యాఖ్యలు.. మంత్రులు అనిత, డోలా ఫైర్
‘తెలుగులో చదివితే ఐటీ ఉద్యోగాలు వస్తాయా? ఏఐ అని చంద్రబాబు అంటారు. ఏఐ తెలుగులో ఉంటుందా?’ అంటూ వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మంగళవారం శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగునే కించపరిచేవిధంగా మాట్లాడతారా? ఆ మాటలను వెనక్కి తీసుకోవాలంటూ మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. మాధవరావు మాటలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రులు కోరారు.