Share News

MLC Anantababu: ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:36 AM

దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు...

MLC Anantababu: ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి

  • హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పిటిషన్‌

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈనెల 22న ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం హైకోర్టులో సవాల్‌ చేశారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. గురువారం కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే అనంతబాబు వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది సి.రఘు అభ్యర్థించారు. పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి వై.లక్ష్మణరావు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:37 AM