AP politics: భర్త జైల్లో .. భార్య ఊహల్లో..
ABN , Publish Date - May 21 , 2025 | 04:43 AM
జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ భార్య బేబీలత రాజకీయ ఆశలు తాజాగా బయటపడ్డాయి. ఓ లాయర్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో తాను తదుపరి హోంమంత్రి అవుతానన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జగన్ మళ్లీ సీఎం అయితే హోంమంత్రి తానేనట!
ఉబ్బితబ్బిబ్బవుతున్న నందిగం సురేశ్ భార్య
లాయర్‌తో ఆనందాన్ని పంచుకున్న బేబీలత
ఇరువురి ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్
గుంటూరు, మే 20(ఆంధ్రజ్యోతి): భర్త జైల్లో ఉంటే భార్య దుఃఖించటం సహజం. కానీ, ఇందుకు భిన్నంగా మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ భార్య ఆశలు, ఆలోచనలు ఉండటం, అవి బహిర్గతమవటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేశ్ ఆనాటి ముఖ్యమంత్రి జగన్ అండ చూసుకొని అనేక అరాచకాలకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి పాపాలు ఇప్పుడు ఆయనను వెంటాడుతూ పలు కేసుల్లో నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. సురేశ్‌ను అరెస్టు చేసిన సందర్భాల్లో ఆయన భార్య బేబీలత పోలీసులతో ఘర్షణ పెట్టుకొని, ఆ తరువాత మీడియాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. బేబీలత తమ మహిళా లాయర్‌తో ఫోన్‌లో జరిపిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో మంగళవారం విస్తృతంగా హల్‌చల్ చేసింది. ఇందులో ఆనాడు జరిగిన సంఘటనలను గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ ఇరువురి సంభాషణల్లో సురేశ్ భార్యను ఉద్దేశించి మహిళా లాయర్ మాట్లాడుతూ.. ‘ఈసారి జగన్ మీకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. మిమ్మల్ని హోంమంత్రిని కూడా చేయటం ఖాయ’మని పొగిడారు. దీనిపై బేబీలత ఫోన్‌లోనే తబ్బితబ్బిబ్బయ్యారు. ‘జైలు వద్దకు మొదట వెళ్లినప్పుడు గేటు వద్ద ఓ అధికారి సెల్యూట్ చేసి భవిష్యత్తులో మీరు హోం మంత్రి అవుతా’రంటూ పొగిడారంటూ తన ఆనందాన్ని లాయర్‌తో బేబీలత పంచుకుంది.
ఫోన్ సంభాషణ ఇలా...
మహిళా లాయర్ : ఒక్క ఎస్సీ (నందిగం సురేశ్) తప్ప అందరూ బయటకు వచ్చేశారు.
సురేశ్ భార్య : నిజంగా అండీ. మీరు కేసు విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు.
లాయర్ : మీరు ఎన్నన్నా నేను పట్టుదలతోనే ఉన్నా. మీరు ఏమన్నా అనుకోండి. నేను మిమ్మల్ని నెక్ట్స్ హోం మినిస్టర్‌గా చూడాలంతే.
సురేశ్ భార్య : అయ్యో... ఆయన ముందు అనేరు లేని పోయింది....
లాయర్: లేదు.... లేదు...కోర్టులో లాయర్లు కూడా ఇదే అనుకుంటున్నారు.
సురేశ్ భార్య: అవును. ఆ రోజు జైలు దగ్గర ఎంట్రీ విషయంలో ఓ సీఐ నా పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అప్పుడే ఆయనను దులిపేశా. అదే సీఐ నిన్న కోర్టు దగ్గర కనిపించాడు. ‘మేడం బాగున్నారా.? సార్‌కు బెయిలొచ్చిందా? మీరు నెక్స్ట్ హోం మినిస్టర్ లే మేడం. మీకేం బాధలేదు.’ అని అన్నాడు. నేను ‘నీకు నా మీద కోపమా...మా ఆయన మీద కోపమా?’ అని గట్టిగా అడిగాను. ‘లేదు...లేదు..మేడం. రాష్ట్రమంతా మీరే తదుపరి హోం మంత్రి అని అనుకుంటున్నారు.’’ అని అన్నాడు. అలా అంటుంటే ఆనందం వేసింది నాకు. భగవంతుడు రాత రాయాలి మేడం... మనుషులు అనుకుంటే అయ్యేది కాదు.
లాయర్ : ఈ మాట అన్నయ్య (నందిగం సురేశ్) అరెస్టు అయినప్పుడే చెప్పాగా. దేవుడు రాసేశాడు. మీరు నెక్ట్స్ హోం మంత్రి...అంతే. ఈ రోజు లాయర్లు ఏమన్నారో చెబితే మీరు నమ్మరు. ‘ఆయన బయటకొచ్చినా బేబమ్మదే హవా సాగుతుంది. జగన్ బేబమ్మకే టికెట్ ఇస్తారు. ఇక సార్ ఇంట్లో ఉండి సేవ చేసుకోవాల్సిందే.’ అని అన్నారు మేడం.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News