YSRCP MP Mithun Reddy : రూ.3 కోట్ల భూమిని కబ్జా చేస్తామా?
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:41 AM
చిత్తూరు జిల్లాలోని మంగళంపేటలో 2000 సంవత్సరంలోనే 75 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, తామెవరి భూమినీ కబ్జా చేయలేదని వైసీపీ

మంగళంపేటలో 2000లోనే 75 ఎకరాలు కొన్నాం
ఎన్ని కేసులు పెట్టినా భయపడేదిలేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ, జనవరి 30(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలోని మంగళంపేటలో 2000 సంవత్సరంలోనే 75 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, తామెవరి భూమినీ కబ్జా చేయలేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వివరణ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పారు. మంగళంపేటలోని భూమి తమ పరిధిలోనిది కాదని గతంలోనే అటవీ శాఖ గెజిట్ ఇచ్చిందని తెలిపారు. తమ ఊర్లో హాస్పిటల్ నిర్మాణానికి రూ.15 కోట్ల విలువైన భూమిని ఇచ్చామని, అలాంటిది కేవలం రూ.3 కోట్ల భూమిని కబ్జా చేశామని చెప్పడం సరికాదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అన్నింటికీ సిద్ధపడే ఉన్నామని తెలిపారు. విజయ సాయిరెడ్డి త్వరలోనే మళ్లీ వైసీపీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తారనే సమాచారం ఉందని, పార్లమెంట్లో చర్చకు లేవనెత్తుతామని తెలిపారు.