Jagan: సినిమా చూపిస్తా
ABN , Publish Date - May 21 , 2025 | 03:15 AM
జగన్ వైసీపీ కార్యకర్తలపై జరిగిన కేసులను తప్పుడు అర్ధంలో చూపిస్తూ, జోలికి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని బెదిరించారు. త్వరలో ప్రభుత్వంపై పెద్ద స్థాయిలో ఉద్యమం ప్రారంభిస్తానని నేతలకు పిలుపునిచ్చారు.
రిటైర్ అయినా.. దేశం విడిచివెళ్లినా పట్టుకొస్తా
మీ జోలికి వచ్చిన వారందరి పేర్లూ రాసుకోండి
అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తా
మరోసారి బెదిరింపులకు దిగిన జగన్
అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): ‘నేనొచ్చానంటే ఎవ్వరినీ బతకనివ్వను!’... ఇది వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పకనే చెబుతున్న మాట! తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ టీడీపీ కార్యకర్తలపైనా, నేతలపైనా, చివరికి చంద్రబాబుపైనా కేసులు పెట్టి అరెస్టు చేయించిన జగన్... ఇప్పుడు ‘తప్పుడు కేసులు... అక్రమ అరెస్టులు’ అని ఆక్రోశిస్తున్నారు. తన హయాంలో జరిగిన అరాచకాలన్నీ... ‘మీరు నాటిన విత్తనం, పెరిగి పెద్దదై మిమ్మల్నే కబళిస్తుంది’ అని టీడీపీ సర్కారును హెచ్చరిస్తున్నారు. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా.. పోలీసు వ్యవస్థపైనా బెదిరింపులకు దిగారు. తాడేపల్లి నివాస ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు, నేతలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని ఆరోపించారు. తన జోలికి, తనవాళ్ల జోలికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ‘జగన్ 2.0’లో అసలు సినిమా చూపిస్తానంటూ బెదిరింపులకు దిగారు. కళ్లు మూసుకుంటే ఒక ఏడాది పూర్తయిందని, మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే తానే అధికారంలోనికి వచ్చేస్తానని జగన్ చెప్పుకొచ్చారు. రెడ్‌బుక్ అనను గాని.. వైసీపీ కార్యకర్త జోలికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరూ రాసుకోవాలని వైసీపీ నేతలకు జగన్ సూచించారు. వైసీపీ జోలికి వచ్చిన పోలీసు అధికారులు రిటైర్ అయినా, విదేశాలకు వెళ్లినా, సప్తసముద్రాల అవతల దాక్కున్నా లాక్కొచ్చి మరీ వారికి సినిమా చూపిస్తామని జగన్ అన్నారు. వల్లభనేని వంశీ, నందిగం సురేశ్ తదితరుల అరెస్టు గురించి ప్రస్తావించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని, ప్రజలు వ్యవస్థలపై తిరగబడే రోజులు వస్తున్నాయని జగన్ జోస్యం చెప్పారు. తాను త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తానని, ఆ మేరకు ప్రభుత్వంపై పోరాడాలని నేతలకు జగన్ పిలుపు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News