Jagan criticism: ప్రజలు మళ్లీ మమ్మల్ని గెలిపిస్తారు
ABN , Publish Date - May 29 , 2025 | 05:43 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్ కడపలో జరిగిన మహానాడు డ్రామానే అని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే నిజమైన సత్తా అని, అప్పుడే తమను ప్రజలు మళ్లీ గెలిపిస్తారని తెలిపారు.
అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం
మహానాడు పెద్ద డ్రామా: జగన్
అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): ప్రజలు మళ్లీ తమను గెలిపిస్తారని, అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. కడపలో మహానాడు పెట్టి తనను తి ట్టడం సత్తా కాదని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అది నిజమైన సత్తా అవుతుందని వ్యాఖ్యానించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ‘టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. కడపలో చంద్రబాబు పోజులు ఇస్తున్నారు. సూప ర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి వదిలేశారు. ఉచిత బస్సు కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు. అమ్మఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన లేవు. ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు. వైద్యం కోసం పేదలు అప్పులపాలవుతున్నారు. ఏడాదిగా రైతు భరోసా అందక చంద్రబాబు పాలనలో రైతులు బాధలు పడుతున్నారు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదు. ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేక పోయారు. ఉన్న 2.6 లక్షల మంది వలంటీర్లను తొలగించారు. మద్యం షాపుల్లో పనిచేసే 15 వేల మంది, రేషన్ బండ్లు నడుపుతూ జీవనోపాధి పొందే 20 వేల మందిని రోడ్డున పడేశారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్‌సీ లేదు. డీఏ పెండింగ్‌లో పెట్టారు. చంద్రబాబు పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్ లాంటి వనరులు దోచేస్తున్నారు.’ అని జగన్ అన్నారు.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News