YS Sharmila: బీజేపీ విధానాలతోనే దేశంలో ఉగ్రవాదం
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:14 AM
పహల్‌గామ్ ఉగ్రదాడి పై ప్రభుత్వ భద్రతా వైఫల్యాన్ని ఒప్పుకున్నందున ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దేశంలో ఉగ్రవాదం పెరిగిపోవడానికి బీజేపీ మత విద్వేష విధానాలే కారణం అని ఆమె ఆరోపించారు.
సెక్యూరిటీ లేదని ఒప్పుకొన్న మోదీ రాజీనామా చేయాలి: షర్మిల
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ‘భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న మత విద్వేష విధానాల వల్లే దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతోంది. పహల్‌గామ్ టూరిస్టులపై ఉగ్రదాడి భద్రతా వైఫల్యంగానే అంగీకరించినందున ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలి’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, సీడబ్ల్యుసీ సభ్యుడు కొప్పుల రాజు ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ... ‘పహల్‌గామ్ ఉగ్రదాడి పూర్తిగా భద్రతా వైఫల్యమే. దేశంలో కశ్మీర్ సేఫ్ ప్లేస్‌గా బీజేపీ ప్రచారం చేసుకుంది. ఇప్పుడు సెక్యూరిటీ లేదని అంగీకరిస్తున్నారు’ అన్నారు. ఈ నెల 9న ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అహ్మదాబాద్ డిక్లరేషన్ పేరిట సమావేశంలో చర్చించామని చెప్పారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..