YCP Leaders: మళ్లీ బెంగళూరుకు జగన్..
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:11 AM
వారాంతపు విడిది కోసం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి బెంగళూరు ఎస్టేట్‌కు శుక్రవారం వెళ్లిపోయారు.
తలలు పట్టుకుంటున్న వైసీపీ నేతలు
అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): వారాంతపు విడిది కోసం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి బెంగళూరు ఎస్టేట్‌కు శుక్రవారం వెళ్లిపోయారు. మొంథా తుఫాన్ తీరందాటిన తర్వాత, తీరగ్గా బుధవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్ వచ్చారు. ఆ రోజంతా ప్యాలె్‌సకే పరిమితమయ్యారు. మరునాడు, గురువారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో ప్రత్యేకంగా తుఫానుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో ఉచిత పంటల బీమా స్కీమ్ అమలు చేయకుండా రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ముంచేశారంటూ ఆ సమావేశంలో ఆయన ఆవేశపడ్డారు.
మెడికల్ కాలేజీలపై తలపెట్టిన ర్యాలీని వాయిదా వేస్తున్నట్టు అదే సమావేశంలో జగన్ తెలిపారు. ఈ సమావేశం ముగిసి 24 గంటలు గడవకుండానే...శుక్రవారం వారాలబ్బాయిలా బెంగళూరు ఎస్టేట్‌కు జగన్ వెళ్లిపోయారు. ఆ మాటకొస్తే నేతలతో భేటీని కూడా మనస్ఫూర్తిగా ఆయన నిర్వహించలేదు. పార్టీ తరఫున తుఫా ను బాధితులకు ఆర్థిక సహాయం చేసే కార్యాచరణనుగానీ, బాధితుల సహాయార్థం ఆ పార్టీ తరఫున విరాళంగానీ ఆయన ప్రకటించలేదు. సింపిల్‌గా....పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం, బీమా మొత్తం అందేలా సహకరించాలంటూ నేతలకు సూచించారు. తాను మాత్రం రాష్ట్రం దాటేశారు. దీంతో అధినేత తీరు ఏమిటో అర్థం కాక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఇవీ చదవండి:
వేల కోట్ల విలువైన ఐపీవోల విడుదల.. ఎప్పుడంటే..?
ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49శాతం విదేశీ పెట్టుబడులు