YS Jagan : నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:38 AM
రాజకీయ నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వైసీపీని వీడిన విజయసాయిరెడ్డికి కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. గురువారం తాడేపల్లి ప్యాలె్‌సలో తన అనుకూల మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వైసీపీని

ప్రలోభాలకో.. భయపడో కాంప్రమైజ్ అయితే మన గౌరవం ఏంది?
సాయిరెడ్డికైనా.. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది: జగన్
అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాజకీయ నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వైసీపీని వీడిన విజయసాయిరెడ్డికి కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. గురువారం తాడేపల్లి ప్యాలె్‌సలో తన అనుకూల మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వైసీపీని వీడడంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు.. వీరిలో పోయినోళ్లు ముగ్గురు. సాయిరెడ్డితో కలిపితే నలుగురు. రాజకీయాల్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ముఖ్యం. క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలియాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. ఫలానా వాడు నాయకుడని కాలర్ ఎగరేసుకుని చెప్పుకోవాలి. అది సీఎం అయినా.. ఎంపీ అయినా.. ఎమ్మెల్యే అయినా సరే.. ఎవరి గురించైనా గొప్పగా చెప్పుకోవాలి. కానీ మనమంతట మనమే ప్రలోభాలకు లొంగో.. భయపడో.. ఏదో కారణం చేత మన వ్యక్తిత్వాన్ని.. క్రెడిబిలిటీని పణంగా పెట్టి.. కాంప్రమైజ్ అయి అటువైపు పోతే మన గౌరవం ఏంది.. మన వాల్యూ ఏంది? మన క్యారెక్టర్ ఏంది? మన క్రెడిబిలిటీ ఏంది.. అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. కష్టం ఎల్లకాలం ఉండదు.. డెమోక్రసీ అంటేనే ఐదేళ్లు. అది సాయిరెడ్డికైనా.. పోయిన ముగ్గురు ఎంపీలకైనా.. ఒకడో అరో పోతే వారికైనా అంతే’ అని జగన్ అన్నారు. మూలనున్న ముసలమ్మా బటన్ నొక్కుతుందని.. ఇందులో వింతేముందంటూ గతంలో తేలిగ్గా మాట్లాడిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఎందుకు బటన్ నొక్కలేదని జగన్ ప్రశ్నించారు. బటన్ నొక్కితే జేబుల్లోకి డబ్బులు రావనే ఆయన డీబీటీ కింద నిధులివ్వడం లేదని ఆరోపించారు. సంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోందన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని ఎన్నికల సమయంలో తాను చెప్పిందే నిజమైందన్నారు. అసెంబ్లీకి తానెందుకు వెళ్లడంలేదో చెప్పాల్సింది స్పీకరేనని చెప్పారు. ఈ విషయంలో హైకోర్టుకు ఆయన సమాధానం పంపలేదని.. పంపితే స్పందిస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం 7 నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులు తెచ్చిందన్నారు. తాను 2019లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే కరోనా రావడంతో రెండున్నరేళ్లు ఆదాయాలు తగ్గిపోయాయని.. ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం ఇచ్చానని.. వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ఇవ్వలేదని. ఈసారి అధికారంలోకి వస్తే వారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానని.. కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులతో సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తానని అన్నారు.