YS Jagan: అన్నీ నేనే చేశా
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:00 AM
రాష్ట్రంలో అభివృద్ధి అంతా తానే చేశానని.. ఆ క్రెడిట్‌ను సీఎం చంద్రబాబు చోరీ చేస్తున్నాడని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నేనే
కరోనాలోనూ 17 మెడికల్ కాలేజీలు తెచ్చా
గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చా
భోగాపురం ఎయిర్‌పోర్టూ నావల్లే
వైసీపీ విద్యార్థి విభాగం భేటీలో జగన్
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అభివృద్ధి అంతా తానే చేశానని.. ఆ క్రెడిట్‌ను సీఎం చంద్రబాబు చోరీ చేస్తున్నాడని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి ప్యాలె్‌సలో తన పార్టీ విద్యార్థి విభాగంతో ఆయన సమావేశమయ్యారు. తాను చేసిన అభివృద్ధి ఇప్పుడు రివర్స్ అయిందని చెప్పారు. 2019 దాకా రాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండేవన్నారు. చంద్రబాబు ఒక్కటీ కట్టలేదన్నారు. కరోనా ఉన్నప్పటికీ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెచ్చానని.. వాటిలో ఐదింటిని రూ.300 కోట్లతో పూర్తి చేశానని చెప్పారు.
మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా 12న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలకు పిలుపిచ్చారు. డిసెంబరులో ఫీజు పోరు చేద్దామని చెప్పారు. వ్యవసాయాన్ని చంద్రబాబు దండగమారిదని అంటారని.. తన హయాంలో పండుగ చేశానని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడానికి తన చొరవే కారణమన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు తన వల్లే వస్తోందని.. ఈ క్రెడిట్‌ను చంద్రబాబు చోరీ చేస్తున్నారని మళ్లీ అన్నారు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు కూడా చేపట్టానని చెప్పారు. భారీ పరిశ్రమలతో పెట్టుబడి ఎక్కువ.. ఉద్యోగాలు తక్కువగా ఉంటాయన్నారు. ఎంఎ్‌సఎంఈలలో పెట్టుబడులు తక్కువ.. ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి ఆదేశాలు
Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం