Share News

Nellore Tragedy: వచ్చే జన్మలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:55 AM

నెల్లూరులో ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి ప్రేమను వారి కుటుంబాలు అంగీకరించకపోవడంతో, మమ్మల్ని క్షమించమని వారు చివరి సందేశం ఇచ్చారు.

Nellore Tragedy: వచ్చే జన్మలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం

నెల్లూరులో ప్రేమ జంట బలవన్మరణం

అంతకుముందు ప్రియుడికి రూ.3.72లక్షల బదిలీ.. ఇద్దరూ పరార్‌

నెల్లూరు(క్రైం)/కైకలూరు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ‘అమ్మా, నాన్నా మీరంటే మాకు ఎంతో ఇష్టం. మిమ్మల్ని వదలి బతకలేం. అలాగని మేము విడిపోయీ బతకలేము. మా వివాహానికి మీరు అంగీకరించరు. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. వచ్చే జన్మలో అయినా మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం’ అంటూ నెల్లూరులో ఓ ప్రేమజంట శుక్రవారం పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బాచ్చు జోసెఫ్‌ రత్నకుమార్‌ (23), ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాకకు చెందిన చిల్లుముంత శ్రావణి (23) విజయవాడలో ఇంజనీరింగ్‌ చదివే సమయం నుంచే ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా శ్రావణి ఆటపాకలో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమె తండ్రి చిల్లిముంత పాల్‌కుమార్‌ ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్లో పలు దఫాలుగా రూ.3,72,000లను రత్నకుమార్‌కు బదిలీ చేసింది. దీనిపై కేసు పెట్టాలని ఈ నెల 20న ఇంట్లో చర్చజరిగింది. దీంతో అదే రోజు రాత్రి శ్రావణి ఇంటి నుంచి పరారైంది. ఆ తర్వాత ఈ నెల 21న రత్నకుమార్‌, శ్రావణి నెల్లూరు వచ్చి ఓ లాడ్జిలో దిగారు. శుక్రవారం వారి గదిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పరిశీలించగా ప్రేమికులిద్దరూ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుని కనిపించారు. సంతపేట ఇన్‌స్పెక్టర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 04:56 AM