మనీ లాండరింగ్ కేసుల్లో నీ పాత్ర ఉంది
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:11 AM
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. 18 మనీ లాండరింగ్ కేసుల్లో నీ పాత్ర ఉంది.. అరెస్టు చేయకూడదంటే డబ్బులు చెల్లించాలి’ అని చెప్పి విడతల వారీగా యువకుడి నుంచి రూ.32.5 లక్షలు కాజేశాడు ఓ సైబర్ మోసగాడు.

అరెస్టు చేయకూడదంటే డబ్బులు చెల్లించాలి
పోలీసు అధికారినని చెప్పి రూ.32.5 లక్షలు కాజేసిన సైబర్ మోసగాడు
శిరివెళ్ల, జనవరి 15(ఆంధ్రజ్యోతి): ‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. 18 మనీ లాండరింగ్ కేసుల్లో నీ పాత్ర ఉంది.. అరెస్టు చేయకూడదంటే డబ్బులు చెల్లించాలి’ అని చెప్పి విడతల వారీగా యువకుడి నుంచి రూ.32.5 లక్షలు కాజేశాడు ఓ సైబర్ మోసగాడు. ఈ ఘటన శిరివెళ్లలో జరిగింది. శిరివెళ్ల ఎస్‌ఐ చిన్న పీరయ్య తెలిపిన వివరాలివీ.. శిరివెళ్లకు చెందిన నంద కిశోర్ అనే యవకుడికి కొన్ని నెలల క్రితం ఓ వ్యక్తి ఫోన చేశాడు. మనీ లాండరింగ్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యావని.. కేసుల్లో నుంచి బయటపడేందుకు, అరెస్టు చేయకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో సైబర్ మోసగాడి మాటలకు భయభ్రాంతులకు గురైన బాధితుడు నంద కిశోర్ నిందితుడు ఇచ్చిన పలు బ్యాంకు అకౌంట్లలో విడతల వారీగా రూ.32,50,600 జమ చేశాడు. అనంతరం ఇంకా డబ్బులు ఇవ్వాలని సైబర్ మోసగాడు బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితుడు నంద కిశోర్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.