వలసల నివారణకే వైసీపీ పోరుబాట డ్రామా
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:46 PM
తమ పార్టీ నుంచి వలసలు ఆపటానికే వైసీపీ పోరుబాట డ్రామాకు తెరలేపిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఎద్దేవా చేశారు.

నంద్యాల మున్సిపాలిటీ ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ నుంచి వలసలు ఆపటానికే వైసీపీ పోరుబాట డ్రామాకు తెరలేపిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఎద్దేవా చేశారు. నంద్యాలలో తెలుగు గంగ ఆయకట్టు ఛైర్మన కార్యాలయాన్ని ఎమ్మెల్యే సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనం తరం ఆమె మాట్లాడుతూ మండలంలోని చాబోలు పరిసరాల్లో తమ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం అక్రమాలకు పాల్పడిన శిల్పాతో పాటు సహకరించిన అధికారులనూ వదలమని హెచ్చరించారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం శిల్పా పొలాలకు నీరు పారే కెసీ కెనాల్‌ను సైతం ఆక్రమించారని ఆరోపించారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ వల్లే ఆళ్లగడ్డ ప్రాంతంలో ఫ్యాక్షన తగ్గి రైతులు ఆనందంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా ఆ పార్టీ నాయకులు కనీసం రైతులను పట్టించుకోలేదని విమర్శించారు.
సమన్వయంతో ఆయకట్టు అభివృద్ధి: చైర్మన సంజీవ కుమార్ రెడ్డి
లెలుగు గంగ సిబ్బంది, రైతుల సమన్వయంతో చివరి ఆయకట్టుకూ నీరు పారేలా కృషి చేస్తానని తెలుగు గంగ సాగు సంఘం ఛైర్మన సంజీవ కుమార్ రెడ్డి తెలిపారు. అక్కడక్కడ దెబ్బ తిన్న తెలుగు గంగ కాలువల మరమ్మతుతో పాటు ప్రాజెక్టు అభివృద్ధికి అవసరమైన నిధుల ప్రతిపాదన చేస్తామని హామీ ఇచ్చారు. ఆయకట్టు విస్తీర్ణం పెరిగేలా కృషి చేస్తానని తెలిపారు. తెలుగు గంగ కార్యాలయ మరమ్మత్తులు కోసం ప్రయత్నిస్తానన్నారు. కార్యక్రమంలో, టీడీపి శిరివెళ్ల మండల కన్వీనర్ శ్రీకాంత రెడ్డి మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ తో పాటు, మాజీ కౌన్సిలర్ ఇమ్మానియేల్ అయ్యాలూరు మహిళా టీడీపి నాయకురాలు శంకరమ్మ గంగవరం సాగు నీటి సంఘం అధ్యక్షులు జనార్ధన రెడ్డి, నాయకులు రామ, ఈశ్వరయ్య తదీతరులు పాల్గొన్నారు.