భక్తిశ్రద్ధలతో వాసవీమాతకు పూజలు
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:56 PM
వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆత్మార్పణ ది నం సందర్భంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నగరంలోని అమ్మవారిశాల వీధి లో గల వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో పూజలు చేశారు.

కడప కల్చరల్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆత్మార్పణ ది నం సందర్భంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నగరంలోని అమ్మవారిశాల వీధి లో గల వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో పూజలు చేశారు. రెండో రోజైన శుక్రవారం నగరంలోని వైవీచలం వీధిలోని రు క్మిణీ పాండురంగ స్వామి ఆలయం నుంచి 102 క్షీర క లశాలతో ఉభయదారులతో ఊరేగింపుగా శ్రీరాములవీధి గుండా వాసవీ కన్యకాపరమేశ్వరికి పంచామృతాభిషేకం చేశారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు బెస్తవేముల రాంహేశ, పుల్లయ తదితరులు పాల్గొన్నారు.
పులివెందులలో...
పులివెందుల పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు పూర్ణ కలశంతో స్వాగతం పలికారు. అనంతరం వాసవీ మాత ఆత్మార్పణ హోమగుండం ప్రారంభించారు. అమ్మవారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. పులివెందుల ఆర్యవైశ్య సం ఘం అధ్యక్షుడు దేసు శ్రీనివాసులు, డిసి్ట్రక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ మేడం దినే్‌షకుమార్, వాసవీ క్లబ్ రీజన చైర్మన దిండుకుర్తి నాగభూషణం పాల్గొన్నారు.